- Advertisement -
పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది: ఎస్పీ మహేష్ బి. గితే
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
జిల్లాలో హోమ్ గార్డ్‌గా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మరణించిన సుధాకర్ కుటుంబ సభ్యులకు జిల్లా పోలీసు కార్యాలయంలో హోమ్ గార్డ్ వెల్ఫేర్ ఫండ్ నుండి రూ.15,000/- ఆర్థిక సహాయం ఎస్పీ మహేష్ బిగితే చేతుల మీదుగా అందించారు. ఈసందర్భంగా పోలీసు శాఖ ఎల్లప్పుడూ సిబ్బందికి వారి కుటుంబాలకు అండగా ఉంటుందని తెలిపారు.ఈకార్యక్రమంలో ఆర్.ఐ యాదగిరి, సుధాకర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -