- Advertisement -
పట్టణ కేంద్రంలో భారీ ర్యాలీ
నవతెలంగాణ – వర్ధన్నపేట
వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోనే 100 పడకల ఆస్పత్రిని నిర్మించాలంటూ ఆస్పత్రి సాధన సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశం అనంతరం, ఆస్పత్రి సాధన సమితి సభ్యులు, స్థానికులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు “జై వర్ధన్నపేట” అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణ ప్రజల ఆరోగ్య అవసరాల దృష్ట్యా 100 పడకల ఆస్పత్రిని పట్టణంలోనే నిర్మించడం అత్యవసరమన్నారు.
ఆస్పత్రిని వేరే ప్రాంతానికి తరలించే ఆలోచనను విరమించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సాధన సమితి నాయకులు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -



