- Advertisement -
నవతెలంగాణ బొమ్మలరామారం
కోతుల బెడదను తప్పించేందుకు కొత్తగా ఎన్నికైన సర్పంచ్ వినూత్న ఆలోచన చేశాడు. ఎలుగుబంటి వేషంతో గ్రామమంతా తిరుగుతూ కోతులను తరిమికొట్టాడు.మండలం మైలారం గ్రామ యువ సర్పంచ్ బుడుమ వెంకటేష్ సోమవారం గ్రామంలో కోతుల బెడదతో ఇబ్బందులు పడుతున్నారని, కోతుల బెడదను తప్పించేందుకు ఎలుగుబంటి వేషంలో గ్రామమంతా తిరుగుతూ కోతులను భయపెడుతూ తిరిగారు. ఆ వేషం చూసి కోతులు అక్కడి నుంచి పారిపోయాయి. ఇలాంటి ఎలుగుబంటి దుస్తులను మరో రెండు మూడు తెప్పించి కోతులు రాకుండా చేస్తానని వెంకటేష్ హామీ ఇచ్చాడు.
- Advertisement -



