నవతెలంగాణ – కామారెడ్డి
ఆదివారం కామారెడ్డి శివారులో త్రుటిలో పేను ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన దంపతులు కామారెడ్డి మీదుగా బంధువుల ఇంటికి దోమకొండ మండలం అంబర్పేట గ్రామానికి వెళుతున్నారు. అయితే సిరిసిల్ల రోడ్డు పూర్తిగా గుంతలమయంగా ఉంది. ఈ రోడ్డుపై బైక్ జంప్ అయ్యింది. దీంతో బైక్ వెనకాల కూర్చున్న తల్లి కూతురు ఒక ఉదుటన రోడ్డుకు అటువైపు పడిపోయారు. అదృష్టవశాత్తూ.. పసిగుడ్డు గడ్డిపై పడటంతో ఆమెకు ప్రమాదం తప్పింది. కొద్ది దూరంలోనే బండరాల్లో ఉన్నాయి. వాటిపైన తల్లి కూతురు పడ్డట్లయితే వారు మృతి చెందే వారిని స్థానికులు పేర్కొన్నారు.
ఇదే దారిలో కలెక్టర్ అధికారుల ప్రయాణం..
ఈనెల 11న మొదటి విడతలో సర్పంచ్ ఎన్నికలు కామారెడ్డి డివిజన్ పరిధిలో నిర్వహించారు. ఎన్నికలను పరిశీలించేందుకు ప్రతిరోజు కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, ఎస్పీ, ఆర్డిఓ తదితరులు మూడు రోజులు ఇదే రోడు గుండా ప్రయాణం చేశారు. అయినప్పటికీ ఆ గుంతల గురించి ఎవరు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆ గ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధుల సైతం ఇదే దారిలో మాచారెడ్డికి వెళ్లి వస్తున్నారు. అయినప్పటికీ ఈ దారిలో ఉన్న గుంతలను మూసి వేయడానికి ఏ ఒక్క ప్రజా ప్రతినిధి కూడా అధికారులకు సూచించడం లేదని, అధికారులు చూసిన మాకెందుకులే అని వదిలేస్తున్నారని తద్వారా పెను ప్రమాదం జరిగితే కానీ అధికారులు స్పందించేటట్లు లేరని స్థానికులు పేర్కొంటున్నారు.
ఆగస్టు నెలలో కురిసిన వర్షాలకు రోడ్లు ధ్వంసం…
ఈ సంవత్సరం ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ ధ్వంసం అయ్యాయి. ప్రభుత్వం వెంటనే రోడ్ల మరమతులకు నిధులను విడుదల చేసింది, అక్కడక్కడ ప్యాచ్ వర్క్ లు చేయడం జరిగింది. ఆ ప్యాచ్ వర్క్ల చేసిన పది పదిహేను రోజుల్లోనే వారు వేసిన కంకర సిమెంట్ వెళ్లిపోవడం రోడ్లు యధావిధిగా కావడంతో తిరిగి ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. వివరాలు తెలుసుకునేందుకు ఆర్ అండ్ బి అధికారులకు ఫోన్ చేయగా వారు అందుబాటులో లేరు.


