Saturday, March 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరాష్ట్రాభివృద్ధికి బ్లూప్రింట్‌

రాష్ట్రాభివృద్ధికి బ్లూప్రింట్‌

- Advertisement -

బడ్జెట్‌పై ఉప ముఖ్యమంత్రి భట్టి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఈ బడ్జెట్‌ ఒక సుందరమైన సుసంపన్నమైన ప్రశాంతమైన తెలంగాణను నిర్మించే బ్లూ ప్రింట్‌ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు కేవలం విమర్శలకే పరిమితం కాకుండా రాష్ట్రాభివృద్ధికి నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ బడ్జెట్‌లో అన్ని వర్గాల ప్రజలకూ మేలు కలిగేలా పథకాలను ప్రకటించామని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అన్ని రంగాలూ అభివృద్ధి చెందేలా కేటాయింపులు చేశామన్నారు. అందరి మన్ననలు పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -