Tuesday, September 9, 2025
E-PAPER
spot_img
Homeసినిమాయూత్‌కి బాగా కనెక్ట్‌ అయ్యే 'బుకీ'

యూత్‌కి బాగా కనెక్ట్‌ అయ్యే ‘బుకీ’

- Advertisement -

అజరు దిషన్‌, ధనుష హీరో, హీరో యిన్స్‌గా గణేష్‌ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న యూత్‌ఫుల్‌ ఎంటర్టైనర్‌ ‘బుకీ’. విజరు ఆంటోనీ ఫిల్మ్‌ కార్పొ రషన్‌, శరవంత్‌ రామ్‌ క్రియేషన్స్‌ బ్యానర్స్‌ పై రామంజనేయులు జవ్వాజీ నిర్మిస్తున్నారు.
విఎఎఫ్సి ప్రజెంట్‌ చేస్తున్నారు. సోమ వారం ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో వైభవంగా లాంచ్‌ అయ్యింది. ముహూ ర్తపు సన్నివేశానికి నటుడు సత్య దేవ్‌ ఫస్ట్‌ క్లాప్‌ కొట్టగా, నిర్మాత సి.కళ్యాణ్‌ కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. మంచు లక్ష్మి స్క్రిప్ట్‌ అందించారు. విజరు ఆంథోని, రామాంజనేయులు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పాండియరాజన్‌, సునీల్‌, లక్ష్మి మంచు, ఇందుమతి, వివేక్‌ ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్‌ అందిస్తున్న విజరు ఆంటోనీ మాట్లాడుతూ,’ఇప్పటికే చిత్రీకరణ మొదలైంది. పుటేజ్‌ చూశాను. చాలా అద్భుతంగా ఉంది. ఇదొక మంచి కమర్షియల్‌ సక్సెస్‌ అవుతుందని నమ్మకం ఉంది. ఫిబ్రవరిలో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నాం’ అని తెలిపారు.
‘ఇప్పుడున్న యూత్‌కి అద్భుతంగా కనెక్ట్‌ అయ్యేలా ఈ స్క్రిప్ట్‌ని రెడీ చేసాం. ఇందులో మంచి మెసేజ్‌ కూడా ఉంది. చిన్నలకు పెద్దలకు అందరికీ నచ్చేలా ఉంటుంది’ అని ప్రొడ్యూసర్‌ రామంజనేయులు అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad