ప్రభుత్వ ఆధీనంలో వ్యక్తిగత సమాచారం
అమలులోకి వచ్చిన డీపీడీపీ చట్ట నిబంధనలు
న్యూఢిల్లీ:వివాదాస్పద డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) చట్ట నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. తొలుత డీపీడీపీ చట్టం లోని పరిపాలనా సంబంధమైన నిబంధనలు అమలులోకి వచ్చాయి. రాబోయే 18 నెలలో కాలంలో ఇతర నిబంధనలను కూడా దశల వారీగా నోటిఫై చేస్తారు. సమాచార హక్కు (ఆర్‌టీఐ) చట్టంలోని సెక్షన్ 8 (1) (జే)పై నేరుగా ప్రభావం చూపే డీపీడీపీ చట్టంలోని సెక్షన్ 44 (3)ని కూడా ప్రభుత్వం అమలు లోకి తెచ్చింది. జరిమానాలకు సంబంధించిన నిబంధనలు కూడా తక్షణమే అమలులోకి వచ్చాయి.
వ్యక్తుల గోప్యతను కాపాడేందు కు ప్రభుత్వం తీసుకొచ్చిన మొట్ట మొదటి చట్టం డీపీడీపీ. దీని ప్రకారం వివిధ వేదికలు తమ విని యోగదారుల ప్రైవేటు సమాచారా న్ని గోప్యంగా ఉంచాల్సి ఉంటుంది. వినియోగ దారులు కోరితే ఆ సమాచారాన్ని తొలగించాలి కూడా. డీపీడీపీ చట్టంలోని సెక్షన్ 44 (3)ని అమలులోకి తేవడంతో పౌరుల సమాచార హక్కుకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇది ఆర్‌టీఐ చట్టంలోని సెక్షన్ 8(1) (జే) ని నీరుకారుస్తుంది. ప్రజా ప్రయోజ నాల కోసం లేదా విస్తృత ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే సందర్భాలలో వ్యక్తుల సమాచారాన్ని బహిర్గతం చేయడానికి డీపీడీపీ సెక్షన్ అనుమతిస్తోంది.
ఆర్‌టీఐ చట్ట నిబంధనల ప్రకారం డిజిటల్ వేదికల వినియోగ దారులందరికీ నోటీసులు అందజే యాలి. డేటా భద్రతలో ఏదైనా ఉల్లంఘన జరిగితే వినియోగ దారులకు తెలియజేయాలి. డిజిటల్ వేదికలు ఏ మేరకు, ఎంత పరి మాణంలో డేటాను తమ వద్ద ఉంచుకోవాలన్న విషయంపై కొన్ని పరిమితులు ఉంటాయి. అంతే కాకుండా డేటా విశ్వసనీ యతను… అంటే వినియోగదారుల గోప్యతను కాపాడాల్సిన వారు ఆ బాధ్యతను నెరవేర్చడానికి కఠినమైన ప్రమాణా లు పాటించాల్సి ఉంటుంది. ఇక కంపెనీలు వ్యక్తిగత డేటా ఎలా సేకరించాలి, ఎలా భద్రపరచాలి, దానిని ఎలా నిలుపుకోవాలి, ఎలా తొలగించాలి…వంటి అంశాలపై డీపీడీపీ చట్టం కొన్ని నియమాలను నిర్దేశించింది. అయితే వీటిలో చాలా వరకూ ఓ సంవత్సరం తర్వాత మాత్రమే అమలులోకి వస్తాయి. డీపీడీపీ చట్ట నియమ నిబంధనలపై జనవరి నుంచే సంప్రదింపులు కొనసాగుతున్నాయి. అయితే ఈ చట్టం సుమారు దశాబ్ద కాలంగా అమలులో ఉన్నదే. కానీ చిన్నారుల విషయంలో డిజిటల్ వేదికలు ఏదైనా వ్యక్తిగత సమాచారాన్ని పబ్లిక్ డొమైన్‌లో పెట్టే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, సమ్మతి పొందాలని తాజా నిబంధనలు నిర్దేశిస్తున్నాయి.
ఐఎఫ్‌ఎఫ్ ఆందోళన
తక్షణమే అమలులోకి వచ్చిన డీపీడీపీ చట్ట నిబంధనలు పారదర్శకత, వ్యక్తిగత స్వేచ్ఛకు అవరోధాలుగా మారబోతున్నాయని ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ (ఐఎఫ్‌ఎఫ్) ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించే పనిని ప్రభుత్వ సంస్థలకు అప్పగించడంతో ఆ సమాచారం సర్కారు అధీనంలోకి పోతుందని ఆరోపించింది. దేశ ప్రయోజనాలను సాకుగా చూపించి డిజిటల్ వేదికల నుంచి వ్యక్తిగత డేటాను డిమాండ్ చేసేందుకు ప్రభుత్వానికి అపరిమిత అధికారం లభిస్తుందని తెలిపింది.


