హీరో శ్రీ విష్ణు కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.3గా సుమంత్ నాయుడు జి నిర్మిస్తున్నారు. హేమ- షాలిని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సాయి కృష్ణ బొబ్బా, రామాచారి ఎం సహ నిర్మాతలు. సోమవారం సినిమా టీం ఒక యానిమేషన్ వీడియో ద్వారా సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేశారు. స్టైలిష్ యానిమేటెడ్ వీడియో ద్వారా టైటిల్‌ను రివీల్ చేశారు. అర్బన్ సెటప్‌లో సాగే ఈ గ్లింప్స్‌లో కస్టమ్ యెల్లో మోటార్‌సైకిల్‌పై నగర వీధుల్లో దూసుకెళ్తున్న శ్రీ విష్ణు మొదటి ఫ్రేమ్ నుంచే అలరించారు. ఈ సినిమాకు ‘విష్ణు విన్యాసం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో నయన సారిక కథానాయికగా నటిస్తుండగా, సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ కీలక పాత్రలు చేస్తున్నారు.
సరికొత్తగా ‘విష్ణు విన్యాసం’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



