Saturday, March 21, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలురాష్ట్ర భవిష్యత్‌ను నిర్దేశించే బడ్జెట్‌

రాష్ట్ర భవిష్యత్‌ను నిర్దేశించే బడ్జెట్‌

- Advertisement -

అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చాం : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఎన్‌ఈపీకి అనుగుణంగా మార్పులు చేస్తామని వెల్లడి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాబోయే ఆర్థిక సంవత్సరాని(2026-27)కి తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రాష్ట్ర భవిష్యత్‌ను నిర్దేశించేదిగా ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈసారి పద్దులో అభివృద్ధి, సంక్షేమ రంగాలకు తగు ప్రాధాన్యతనిచ్చామని ఆయన తెలిపారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రతిపాదించిన అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డి… మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బడ్జెట్‌లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేశామన్నారు. తెలంగాణ రైజింగ్‌ విజన్‌ లక్ష్యానికి అనుగుణంగా వివిధ రంగాలకు నిధులను కేటాయించామని తెలిపారు. అన్ని వర్గాలను సంతృప్తి పరిచే విధంగా పద్దును రూపొందించామని వివరించారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి జీవిత బీమాను ప్రవేశపెట్టామని వెల్లడించారు. తద్వారా ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల బీమాను అందించబోతున్నామని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా 1.15 కోట్ల కుటుంబాలకు లబ్ది చేకూరనుందని తెలిపారు.

విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలకు, ప్రజారోగ్య సంరక్షణకు అత్యధిక నిధులు కేటాయించామని చెప్పారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట్రంలో కూడా మార్పులు తీసుకొస్తామని స్పష్టం చేశారు. ప్రీ ప్రైమరీ నుంచి ప్లస్‌ టు వరకు విద్యార్థులు ఒకే చోట ప్రభుత్వ స్కూళ్లలో చదివే విధంగా నూతన విధానాన్ని రూపొందిస్తామని తెలిపారు. అప్పులు, ఆదాయాలకు సంబంధించిన అన్ని అంశాలను పారదర్శకంగా బడ్జెట్‌లో పొందుపరిచామని సీఎం చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజా ప్రభుత్వం చేసిన అప్పు రూ.3.47లక్షల కోట్లని వివరించారు. ఇందులో నుంచి గత ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలకే 3.30 లక్షల కోట్లు చెల్లించామన్నారు. వివిధ విభాగాల్లో ఉన్న లీకేజీలను అరికట్టటం ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతామని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబడతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదముద్ర…
కాగా రాష్ట్ర బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శుక్రవారం ఉదయం 10.15 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్‌ ప్రారంభమైంది. పద్దుపై వెంటనే చర్చించి, ఆమోదముద్ర వేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -