Friday, December 19, 2025
E-PAPER
Homeజాతీయంసుకుమా అడవుల్లో పేలిన తూటా

సుకుమా అడవుల్లో పేలిన తూటా

- Advertisement -

మహిళతో సహా ముగ్గురు మావోయిస్టులు మృతి

నవతెలంగాణ-చర్ల
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కిష్టారం అడవుల్లో గురువారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మహిళ మావోయిస్టుతో సహా ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారని సుకుమా ఎస్పీ కిరణ్‌ చౌహన్‌ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. గోలపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అటవీ కొండల్లో మావోయిస్టుల ఉనికి ఉన్నట్టు సమాచారం అందింది. దాని అధారంగా.. సుక్మా జిల్లా డీఆర్‌జీ బృందం శోధన ఆపరేషన్‌ ప్రారంభించింది. గురువారం తెల్లవారుజామున 5 నుంచి 6 గంటల సమయంలో కిష్టారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సింగనమరుగు ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులు తారసపడగా ఇరువురి మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆయుధాలతో పాటు కిష్టారం ఏరియా కమిటీ సభ్యులు మాడవి జోగ అలియాస్‌ మున్న అలియాస్‌ జగత్‌, సోంది బండి, నుప్పో బజ్ని మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ ధ్రువీకరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -