సబ్ కలెక్టర్ కు నిర్వాసితుల ఫిర్యాదు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని కాపురం బ్లాక్-1కు 500 మీటర్ల డేంజర్ జోన్లో ఉన్న ఇండ్ల జాబితాలో తప్పులు తడకగా ఉందని నిర్వాసితులు ఆందోళనకు గురివుతున్నట్లుగా తెలుస్తోంది. తమ ఇండ్లు ఓల్డ్ జెన్కోలో ఉన్నట్లుగా (గని ఉపరితలలో కోల్పోయినట్లుగా) ప్రస్తుతం సర్వే చేస్తున్న జాబితాలో వచ్చినట్లుగా ఇందారపు రవిందర్ ఇంటి నెం.టిఎస్ జెన్కో1665,గుగ్గిళ్ల లచ్చయ్య ఇంటి నెం.టిఎస్ జెన్కో1663,కేశారపు కొమురయ్య, ఇంటి నెం.టిఎస్ జెన్కో1661,ఇందారపు రామయ్య,టిఎస్ జెన్కో1662,కేశారపు దుర్గమ్మ టిఎస్ జెన్కో1664 తదితర భూనిర్వాసితులు ఇటీవల కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ కు పిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. మరి కొంతమంది నిర్వాసితుల పేర్లు జాబితాలో మొత్తమే రనట్లుగా అయోమయానికి గురివుతున్నట్లుగా తెలుస్తోంది.
డేంజర్ జోన్ ఇండ్ల లెక్కలు ఇలా…
ఓసీపీకి 500 మీటర్ల దూరంలో డేంజర్ జోన్ ఉంది.ఇండ్లను భూములను సేకరిస్తామని జెన్కో అధికారులు 17,12,2022 సంవత్సరంలో డిడి పబ్లికేషన్ చేస్తూ 2,817 ఇండ్లకు టిఎస్ జెన్కో నెంబర్లు వేసి పలు పత్రికల్లో ఇచ్చారు.ప్రస్తుతం రెవెన్యూ, పంచాయతీ అధికారులు గత రెండు వారాలుగా సర్వే చేస్తున్న నేపథ్యంలో మొదటి విడతలో 1,203.రెండు విడతలో 1.062.మొత్తం 2,265 ఇండ్లను మాత్రమే సర్వేలు చేస్తున్నారు.అధికారులు లెక్కల్లో చెప్పేవి మాత్రం 2472 ఈ మూడు సంఖ్యలో ఎది నిజమో తెలియక నిర్వాసితులు అయోమయానికి గురివుతున్నారు.2010 సంవత్సరంలో ఏపీ జెన్కో పేరుతో 1329 డ్లకు నెంబర్లు వేశారు.
2007-08 ఎపి జెన్కో పేరుతో 1088 నెంబర్లు వేసిన ఇండ్లకు ఆర్థిక,సామాజిక సర్వేలు నిర్వహించి అధికారులు చేతులు దులుపుకొన్నారు.వీటికి బై నెంబర్లు వేసిన నేపథ్యంలోనే 243 ఇండ్లు పేరిగినట్లుగా తెలుస్తోంది.కానీ బై నెంబర్ల మాయ పంచాయతీ అధికారులదా..? లేక రెవెన్యూ అధికారులదా..? అనేది అంతుచిక్కని ప్రశ్న.టిఎస్ జెన్కో వేసిన నెంబర్లు,పత్రికల్లో పబ్లిష్ చెసిన మొత్తం 2,817 ఇండ్ల సంఖ్యకు సరిపడేలా ఉండాలంటే ఇటీవల నిర్వహిస్తున్న సర్వేలో మొదటి విడతలో 1,203 ఇండ్లు ఉంటే రెండో విడతలో 1614 ఉండాలి. కానీ 1062 మాత్రమే ఉన్నాయి.అంటే 552 లెక్కలు కానరావడం లేదు.



