మాజీ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రజా సమస్యలను పట్టించుకోకుండా రాష్ట్ర క్యాబినెట్ దీపావళికి ప్రజలకు నిరాశే మిగిల్చిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల బోనస్ బకాయిలు రూ.1,300 కోట్లు, మహిళలకు రూ.2,500 ఇచ్చే మహాలక్ష్మి పథకం ప్రారంభం వంటివేవి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలన వదిలేసిన సీఎం, మంత్రులు కమిషన్లు, కాంట్రాక్టులు, అక్రమ వసూళ్లతో వ్యక్తిగత పంచాయతీలకు పరిమితమయ్యారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ తప్పిదాలతో ఎనిమిదేండ్లలో తొలిసారిగా 2024-25లో అతి తక్కువగా 2,049 పరిశ్రమలు, రూ.50 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని విమర్శించారు. పారిశ్రామికవేత్తలను బెదిరిస్తుండటంతో వారు వెనక్కి వెళ్లిపోతున్నారని తెలిపారు.
ముఖ్యమంత్రి సన్నిహితులే తుపాకి పట్టి బెదిరించారనీ ఒక మంత్రి కుమార్తె చెబుతున్నారనీ, రాష్ట్రంలో అరాచక రాజ్యం నడుస్తున్నదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ఏం సాధించారని విజయోత్సవాలు నిర్వహిస్తారో చెప్పాలని ఎద్దేవా చేశారు. హామీలను అమలు చేయలేదనీ, అభివృద్ధి పనులను పూర్తి చేయలేదనీ, పథకాలను కొనసాగించలేదని విమర్శించారు. కొత్తగా హ్యామ్ మోడల్ అనేది కమిషన్లను దండుకోవడానికేనని ఆరోపించారు. కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంచి, లైఫ్ టైం ట్యాక్సులు, రిజిస్ట్రేషన్ చార్జీలు అడ్డగోలుగా పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాగానే హ్యాం మోడల్‌పై విచారణ జరిపిస్తామని హెచ్చరించారు. ఎవరికి కష్టం వచ్చినా బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. వారినీ, రాష్ట్రాన్ని కాపాడుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రజా సమస్యలు పట్టించుకోని క్యాబినెట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES