రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని హుటాహుటిన అంబులెన్స్ లో తరలింపు
నవతెలంగాణ డిచ్ పల్లి.
బుధవారం మధ్యాహ్నం సమయంలో డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నడిపల్లి గ్రామ శివారులో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అశోక్ గాబ్రీ అదుపుతప్పి రోడ్డు ప్రక్కన పడి పోయాడు. అ వ్యక్తికి తలకు బలమైన గాయాలు అయి తీవ్రంగా రక్తస్రావంతో బాధపడుతున్నటు కుప్పకులడు.అదే సమయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య డిచ్పల్లి వైపు వస్తుండగా ఒక్కసారి గమనించి తన కారు ఆపి ఆ వ్యక్తిని పరామర్శించి సత్వరమే అంబులెన్స్ కు ఫోన్ చేసి అంబులెన్స్ లో తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు.ఈ సందర్భంగా డిచ్పల్లి ఎస్ హెచ్ ఓ మోహమ్మద్ షరీఫ్ పోలీస్ సిబ్బంది తదితరులు ఘటన స్థలానికి చేరుకున్నారు.