డివైఏప్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆత్కూరి శ్రీకాంత్
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఎడ్లపల్లి మోడల్ స్కూల్ కి వచ్చిన పీఎం శ్రీ నిధులపై సమగ్ర విచారణ చేపట్టాలని డివైఏప్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆత్కూరి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. బుధవారం కొయ్యుర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు పిఎంశ్రీ నిధుల్లో అవినీతి జరిగిందనే అనుమానాలున్నాయని దానికి పూర్తి బాధ్యత ప్రిన్స్ పాల్, జిల్లా విద్యాశాఖ అధికారులే బాధ్యత వహించాలని ఆరోపించారు. నిధుల్లో అవినీతి జరిగిందని,సమాచారం ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారులను సమాచారం ద్వారా అడిగితే కాలయాపన చేస్తున్నారు తప్పా సమాచారాన్ని ఇవ్వడం లేదన్నారు.స్కూల్లో అత్యధిక శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలే చదువుతున్నారని విద్యలో పురోగమనం జరగాలని ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నిధుల నుంచి ఒక స్కీమ్ గా వెనుకబడిన జిల్లాల్లో 150కి పైగా మెజారిటీ విద్యార్థులు ఉన్నటువంటి స్కూల్స్ ని ఎంచుకొని 2023 నుంచి పిఎంశ్రీ నిధులను జిల్లా వ్యాప్తంగా ఇచ్చారని తెలిపారు.
గత సంవత్సరం రూ.20 లక్షల నిధులు వచ్చినట్లుగా తెలుస్తుందని,కానీ మోడల్ స్కూల్ అభివృద్ధిలో ఆ నిధుల పూర్తి వినియోగం జరగకుండా దారి మళ్లినట్లు మాకు పూర్తిస్థాయి అనుమానం వ్యక్తం చేశారు. నిధుల విషయంలో ఆడిట్ నుంచి మొదలుకొని పిఎంసి పూర్తిస్థాయి నిధుల వివరాలను,వాటి ఖర్చులు వాటి ఓచర్లు ఆడిటు, ఆనిధుల ద్వారా జరిగిన అభివృద్ధి ఫోటోలు, నిధుల విషయమై జరిగిన మీటింగ్స్ మినిట్ బుక్స్ టీచర్లు తల్లిదండ్రుల ఆమోదానికి సంబంధించిన వివరాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిధుల వివరాల కోసం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కూడా సమాచార దరఖాస్తులు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించడం జరిగిందన్నారు. ఇప్పటికైనా పూర్తి సమాచారం ఇవ్వనిచో ఆందోళనకు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఆత్కూరి శ్రీధర్, ఆదివాసి గిరిజన సంఘం నాయకుడు కుమార్ పాల్గొన్నారు.



