ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించిన చిత్రం ‘పరదా’. మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా, దర్శన రాజేంద్రన్, సంగీత కీలక పాత్రల్లో నటించారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజరు డొంకడ నిర్మించారు.
ఈ సినిమా ఈనెల 22న రిలీజ్ అవుతున్న సందర్భంగా నిర్మాత విజరు డొంకాడ మీడియాతో మాట్లాడుతూ, ‘కల్చర్‌ని ఫాలో అవుతున్న ఓ అమ్మాయి. ఆ అమ్మాయికి ఊర్లో ఒక సమస్య వస్తుంది. ఆ సమస్యకి ఆ అమ్మాయి పరిష్కారం ఎలా వెతుక్కుంది అనేది కథ. దర్శకుడు ప్రవీణ్ ఈ ‘పరదా’ ఐడియా చెప్పినప్పుడు, తప్పకుండా ఇది గుర్తుండిపోయే సినిమా అవుతుందనే నమ్మకం కలిగింది. ఈ కథకి వాస్తవ జీవితంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ స్ఫూర్తి. తెలుగులో చాలా కొత్త అటెంప్ట్ అవుతుంది. మా కథకు అనుపమ 100 శాతం న్యాయం చేశారు. ఫస్ట్ కాపీ చూసి తన కెరీర్‌లో బెస్ట్ సినిమా అవుతుందని చాలా ఎమోషనల్ అయ్యారు. అలాగే దర్శన, సంగీత పాత్రలు కూడా అద్భుతంగా ఉంటాయి. మలయాళంలో దుల్కర్ రిలీజ్ చేస్తున్నారు. అలాగే సురేష్‌బాబు, రానా సినిమా చూసి, బాగుందన్నారు. సంగీత దర్శకుడు అత్యద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు’ అని తెలిపారు.
ఎప్పటికీ గుర్తుండిపోయే ‘పరదా’
- Advertisement -
- Advertisement -