Tuesday, July 22, 2025
E-PAPER
Homeసినిమామెప్పించే భిన్న కాన్సెప్ట్‌

మెప్పించే భిన్న కాన్సెప్ట్‌

- Advertisement -

తోట శ్రీకాంత్‌ కుమార్‌ రచన, దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘థ్యాంక్యూ డియర్‌’.
మహాలక్ష్మి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై పప్పు బాలాజీ రెడ్డి నిర్మిస్తున్నారు.
ధనుష్‌ రఘుముద్రి, హెబ్బా పటేల్‌, రేఖా నిరోషా ముఖ్య పాత్రల్లో నటించారు. ఇటీవల డైరెక్టర్‌ వివి వినాయక్‌ లాంచ్‌ చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా సోమవారం ఈ చిత్రంలోని తొలి గీతం ‘చిక్కక చిక్కిన గుమ్మ’ను హీరో మంచు మనోజ్‌ లాంచ్‌ చేశారు.
ఈ పాటను నిర్మాత బాలాజీ రెడ్డి స్వయంగా రాయగా, శ్రీచరణ్‌ ఈ పాటకు తన స్వరాన్ని జోడించారు.
ఈ సందర్భంగా మంచు మనోజ్‌ మాట్లాడుతూ,’ఈ సినిమాలోని తొలి పాటను నేను విడుదల చేయడం సంతోషకరంగా ఉంది. ఈ చిత్రం గొప్ప విజయం సాధిం చాలని ఆశిస్తున్నా’ అని అన్నారు.
‘మాకు సపోర్ట్‌గా నిలిచిన మనోజ్‌కి ధన్యవాదాలు. సినిమా కూడా మంచి హిట్‌ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం’ అని నిర్మాత బాలాజీ రెడ్డి చెప్పారు.
‘ఈ పాటని మనోజ్‌ బాగా ఎంజారు చేశారు’ అని సంగీత దర్శకుడు సుభాష్‌ ఆనంద్‌ అన్నారు. లైన్‌ ప్రొడ్యూసర్‌ పునీత్‌ మాట్లాడుతూ, ‘మనోజ్‌ రిలీజ్‌ చేసిన మా తొలి ఇన్‌స్టంట్‌ హిట్‌ అయ్యింది. పాట మాదిరిగానే సినిమా కూడా హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -