టీ.ఆర్ డ్రీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న క్రైమ్ థ్రిల్లర్ ‘సీమంతం’. వజ్రయోగి, శ్రేయ జంటగా సుధాకర్ పాణి దర్శకత్వంలో ఈ మూవీ ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రశాంత్ టాటా నిర్మాణంలో, గాయత్రి సౌమ్య గుడిసేవ సహనిర్మాతగా సుధాకర్ పాణి రచనా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. సినిమా రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. హీరో వజ్రయోగి మాట్లాడుతూ, ‘క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో వస్తోన్న మా సినిమా అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాను. మా డైరెక్టర్ సుధాకర్ ఈ సినిమాను చాలా కొత్తగా తీశారు’ అని చెప్పారు. ‘ఈ చిత్ర నిర్మాత, హీరో వజ్రయోగి నా ఫ్రెండ్. నా కాలేజ్ ఫ్రెండ్‌ను నేను డైరెక్ట్ చేయటం సంతోషంగా ఉంది. సుహాస్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. కెమెరామెన్ శ్రీనివాస్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు’ అని డైరెక్టర్ సుధాకర్ చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ సుహాస్ మాట్లాడుతూ, ‘ఈ సినిమా నాకు చాలా స్పెషల్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగా వచ్చింది’ అని చెప్పారు. కో ప్రొడ్యూసర్ గాయత్రి సౌమ్య మాట్లాడుతూ, ‘ఎన్నో ఒడిదుడుకుల తరువాత మా సినిమా ప్రేక్షకుల దగ్గరకు వస్తోంది. థ్రిల్లర్ జోనర్‌లో వస్తోన్న మా సినిమా కొత్తగా ఉంటుంది’ అని తెలిపారు.
భిన్న క్రైమ్ థ్రిల్లర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



