Saturday, January 31, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅందరూ కనెక్ట్‌ అయ్యే ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌

అందరూ కనెక్ట్‌ అయ్యే ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌

- Advertisement -

అభిషన్‌ జీవింత్‌, అనస్వర రాజన్‌ ప్రధాన పాత్రలలో నటించిన ఫీల్‌-గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘విత్‌ లవ్‌’. మదన్‌ రచన, దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సౌందర్య రజనీకాంత్‌తో పాటు నజరత్‌ పసిలియన్‌, మహేష్‌ రాజ్‌ పసిలియన్‌ ఎంఆర్‌పి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు థియేట్రికల్‌ డిస్ట్రిబ్యూషన్‌ సురేష్‌ ప్రొడక్షన్స్‌ నిర్వహిస్తోంది. తాజాగా మేకర్స్‌ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. హీరో రానా దగ్గుబాటి మాట్లాడుతూ,’ట్రైలర్‌ చూసిన అందరూ చాలా కనెక్ట్‌ అయ్యారు. చూస్తున్నప్పుడు ఇది మన కథే అనిపిస్తోంది. సౌందర్య తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ”టూరిస్ట్‌ ఫ్యామిలీ’కి మీరందరూ గొప్ప ఆదరణ ఇచ్చారు. ఇది కూడా చాలా అద్భుతమైన ఎమోషన్‌ ఉన్న సినిమా. అందరూ కూడా కనెక్ట్‌ అయ్యేలా ఉంటుంది. మన జ్ఞాపకాలని నెమరు వేసుకునేలా ఉంటుంది.

రానా ఈ సినిమాని మరింత గొప్ప స్థాయికి తీసుకువెళ్లారు. ఈ సినిమాతో తెలుగులోకి రావడం చాలా ఆనందంగా ఉంది’ అని హీరో అభిషన్‌ జీవింత్‌ చెప్పారు. హీరోయిన్‌ అనస్వర రాజన్‌ మాట్లాడుతూ,’ఇది చాలా క్యూట్‌ సినిమా. అందరూ కూడా సినిమాని థియేటర్‌లో చూసి ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. ప్రొడ్యూసర్‌ సౌందర్య రజనీకాంత్‌ మాట్లాడుతూ,’ఈ సినిమాని తెలుగులోకి తీసుకురావడం నాకు చాలా ఆనందంగా ఉంది. రానాకి ఈ సినిమా గురించి చెప్పగానే తన సినిమాగా ముందుకు తీసుకొచ్చారు. ఆయన ఈ సినిమాని రిలీజ్‌ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అభిషన్‌ని హీరోగా లాంచ్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది. తను డైరెక్ట్‌ర్‌గా మంచి సక్సెస్‌ ఇచ్చాడు. ఈ సినిమాలో అద్భుతంగా పెర్ఫార్మ్‌ చేశాడు. అనస్వర ఆల్రెడీ తెలుగులో సినిమాలు చేస్తోంది’ అని అన్నారు. ‘రానా ఈ సినిమాని తెలుగులో రిలీజ్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది. చాలా ప్రేమతో ఈ సినిమా చేశాము. ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’లానే ఈ సినిమాని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అని ప్రొడ్యూసర్‌ మహేష్‌ రాజ్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -