నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండలంలోని చిన్న టాక్లి గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికకు ఎస్సీ జనరల్ గా రిజర్వుడ్ అయింది. ఈ గ్రామంలో ఇద్దరు దళితుల మధ్య గెలుపు కోసం హోరాహోరీ పోరు జరుగుతుంది. ఈ గ్రామంలో 500 లోపే ఓట్లు ఉన్నాయి పోలింగ్ 80 లేదా 90% శాతం అయినప్పటికీ ఎవరికి 240 ఓట్లు వస్తే వారే గెలుస్తారు అని చర్చ గ్రామస్తులతో వినబడుతుంది. కొద్ది పార్టీ ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నక్కే వార్ దత్తు బి ఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి యాదవరావు ఇద్దరి మధ్య హోరా హోరి పోరు జరుగుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో ఆ గ్రామంలో గల ఇతర కులస్తుల పెద్దలు ఎటువైపు మొగ్గుచూపితే అటువైపు గెలుపు అనే నినాదం వినబడుతుంది. దీనితో ఇద్దరు అభ్యర్థులు ఓట్ల కోసం గ్రామ పెద్దల మద్దతు కోసం ఆరాటపడుతున్నారు.
చిన్నటాక్లి ఎన్నికల్లో హోరాహోరి పోరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



