హీరో రోషన్ కనకాల నటించిన రెండవ చిత్రం ‘మోగ్లీ 2025’. సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం నేడు (శనివారం) వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో రోషన్ కనకాల మీడియాతో ముచ్చటించారు. ఇది ప్యూర్, ఇన్నోసెన్స్ ఉండే లవ్ స్టోరీ. ఒక్క క్షణం కూడా బోర్ కొట్టకుండా డైరెక్టర్ సందీప్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే డిజైన్ చేశారు. స్క్రీన్ ప్లే చాలా రేసీగా ఉంటుంది. అలాగే హానెస్ట్ లవ్‌స్టోరీ ఉంటుంది. ఆ ప్రేమ కథని అద్భుతంగా పండించాడు. ఈ కథలో కామెడీ, యాక్షన్, అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. చాలా ఆర్గానిక్, జెన్యూన్‌గా రాశారు. మోగ్లీ తన ప్రేమ కోసం దేనికైనా రెడీగా ఉంటాడు. తన ప్రేమ కథకు వచ్చిన అడ్డంకేంటి?, విలన్ నుంచి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి అనేదే ఈ సినిమా. మోగ్లీ అందరికీ కనెక్ట్ అయ్యే క్యారెక్టర్.
ఈ సినిమాలో నాది, బండి సరోజ్ కాంబినేషన్ చాలా అద్బుతంగా ఉంటుంది. ఈ కథకి ఆయన చాలా పర్ఫెక్ట్‌గా సింక్ అయ్యారు. అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. హర్ష ఇందులో చాలా ఇంపాక్ట్ ఫుల్ క్యారెక్టర్ చేశాడు. కథలో తన పాత్ర చాలా కీలకం. కాలభైరవ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. రాజమౌళికి కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చినంత రేంజ్‌లో మ్యూజిక్ ఉంటుంది. సందీప్‌కి, భైరవకు ఉన్న అనుబంధం కారణంగా ఇంకా అద్భుతమైన ట్రాక్స్ వచ్చాయి. తన మ్యూజిక్‌తో సినిమాని మరో స్థాయికి ఎలివేట్ చేశారు. హీరోయిన్ సాక్షి చాలా మంచి నటి. సినిమా కోసం సైన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకుంది. ఈ సినిమాలో మా ఇద్దరి కెమిస్ట్రీ పండితేనే కథ అందరికీ కనెక్ట్ అవుతుంది. అలాంటి కెమిస్ట్రీ చాలా చక్కగా కుదిరింది. సెలబ్రిటీ ప్రీమియర్ షోలో అందరికీ చాలా నచ్చింది. శ్రీ విష్ణు సినిమా గురించి చాలా ప్రత్యేకంగా మాట్లాడారు. సాయి రాజేష్, ఎస్ కే ఎన్, ఇలా ఎంతోమంది ప్రముఖులు వచ్చారు. అందరికీ నచ్చింది. సినిమా గురించి జెన్యూన్‌గా అనిపించింది చెప్పారు. చాలా హ్యాపీగా ఉంది. కొత్తగా రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
ప్రేమ కోసం పోరాటం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



