Wednesday, December 10, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఆద్యంతం వైవిధ్యభరితంగా ఉండే సినిమా

ఆద్యంతం వైవిధ్యభరితంగా ఉండే సినిమా

- Advertisement -

హీరో కార్తి నటించిన కొత్తసినిమా ‘అన్నగారు వస్తారు’. ఈ నెల 12న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌లో కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా నిర్మించారు. యాక్షన్‌ కామెడీ కథతో దర్శకుడు నలన్‌ కుమారస్వామి తెరకెక్కించారు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమా విడుదల సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లిరిసిస్ట్‌ రాకేందు మౌళి, డైరెక్టర్‌ వెంకీ కుడుముల, డైరెక్టర్‌ శివ నిర్వాణ, డైరెక్టర్‌ దేవ కట్టా, డైరెక్టర్‌ వివేక్‌ ఆత్రేయ, డైరెక్టర్‌ రాహుల్‌ రవీంద్రన్‌, డైరెక్టర్‌ శైలేష్‌ కొలను, ప్రొడ్యూసర్‌ బన్నీ వాస్‌, హీరోయిన్‌ కృతి శెట్టి, దర్శక నిర్మాత మధుర శ్రీధర్‌ రెడ్డి, డైరెక్టర్‌ బాబీ, హీరో సందీప్‌ కిషన్‌ తదితరులు హాజరయ్యారు.

మైత్రీ డిస్ట్రిబ్యూషన్‌ శశిధర్‌ మాట్లాడుతూ, ‘మా దగ్గరకు వచ్చే ట్రైలర్‌ను మిత్రులకు పంపిస్తుంటా. వారి నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటాం. అలా ఈ చిత్ర ట్రైలర్‌ను పంపిస్తే ప్రతి ఒక్కరి నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమాను మా సంస్థ ద్వారా రిలీజ్‌ చేస్తుండటం హ్యాపీగా ఉంది’ అని అన్నారు. ప్రొడ్యూసర్‌ బన్నీ వాస్‌ మాట్లాడుతూ, ‘సూర్యతో, జ్ఞానవేల్‌ రాజాతో మాకు మంచి అనుబంధం ఉంది. కార్తి ‘పరుత్తి వీరన్‌’ సినిమాకు థియేటర్స్‌లో వచ్చిన రెస్పాన్స్‌ ఇంకా నేను మర్చిపోలేదు. ఈ రోజు ఈ ఈవెంట్‌ కు ఇంతమంది యంగ్‌ డైరెక్టర్స్‌ వచ్చారంటే దానికి కార్తి మీద వారికి ఉన్న అభిమానమే. కొత్త దర్శకులతో విభిన్నమైన సినిమాలు చేస్తూ వస్తున్నారు కార్తి. నలన్‌ కుమారస్వామి టాలెంటెడ్‌ డైరెక్టర్‌. ఈ కాంబోలో వస్తున్న ఈ సినిమా మంచి సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నా’ అని తెలిపారు.

ఈ చిత్రం నాకొక ఛాలెంజ్‌
‘నేను ‘అన్నగారు వస్తారు’ సినిమాలో నటించడానికి కారణం డైరెక్టర్‌ నలన్‌ కుమారస్వామి. ఆయన ‘సూదు కవ్వమ్‌’ సినిమాకు ఎంతోమంది ఫ్యాన్స్‌ ఉన్నారు. అలాంటి డైరెక్టర్‌ 8 ఏళ్ల తర్వాత చేస్తున్న చిత్రమిది. సినిమాలు చేయకుంటే వాళ్లను మర్చిపోతాం. కానీ నలన్‌ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు. మనం సూపర్‌ హీరో అంటే బ్యాట్‌ మ్యాన్‌, సూపర్‌ మ్యాన్‌ అనే అనుకుంటాం. కానీ మన కల్చర్‌లోనూ ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌ లాంటి సూపర్‌ హీరోస్‌ ఉన్నారు. వాళ్లు మన సినిమాను, పాలిటిక్స్‌ను మార్చేశారు.

అలాంటి సూపర్‌ హీరో తిరిగి వస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో 80వ దశకంలో మాస్‌ కమర్షియల్‌ సినిమా మేనియాను మరోసారి గుర్తుచేసేలా ఈ సినిమా ఉంటుంది. నా వరకు చెప్పాలంటే ఇది రిస్కీ ప్రయత్నం. నేను ‘ఊపిరి’ లాంటి మూవీస్‌ ఈజీగా చేయగలను. కానీ ఇది నాకు ఒక ఛాలెంజింగ్‌ ఫిల్మ్‌. ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌ ఇద్దరి కెరీర్స్‌లో అక్కడి సినిమాలు ఇక్కడ, ఇక్కడి సినిమాలు అక్కడ రీమేక్స్‌ జరిగాయి. ఈ క్రాసోవర్‌ వల్ల ఈ ఇద్దరు మహా నటుల కెరీర్‌లో ఎన్నో పోలికలు కనిపిస్తాయి. అవి మా సినిమాలోనూ చూస్తారు’ -హీరో కార్తి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -