’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో మంచి విజయాన్ని అందు కున్న డైరెక్టర్ మున్నా ధులిపూడి నుంచి వస్తున్న మరో చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్.
అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రంలో రోహన్ సూర్య, మొయిన్ కీలక పాత్రధారులు.
నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, ఎన్‌వీఎల్ క్రియే షన్స్ బ్యానర్స్‌పై శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ మోషన్ పోస్టర్‌ను ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్‌లో దర్శకులు చందూ మొండేటి, శివ నిర్వాణ, కష్ణ చైతన్య ముఖ్య అతిథులుగా పాల్గొని, రివీల్ చేశారు.
నిర్మాతలు మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో పాటలు, కథ అన్నీ చాలా బాగున్నాయి. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. ప్రతి ఫ్యామిలీ ఈ సినిమా చూసి ఎంజారు చేయాలని కోరుతున్నాం’ అని అన్నారు.
‘నాకు ఇంత గుర్తింపు రావడానికి కారణం చంద్రబోస్, అనూప్. నేను ఎప్పుడు సినిమాలు చేసినా వీళ్లిద్దరితోనే చేస్తా. మా కాంబినేషన్‌లో మళ్లీ అలాంటి పాట రాబోతోంది. 10 రోజుల్లో సాంగ్ రిలీజ్ చేస్తాం. అదొక మంచి ప్రీవెడ్డింగ్ సాంగ్ అవుతుంది. అమ్మాయిలకు పెళ్లి ముందు ఉండే ఫ్రీడం పెళ్లి తర్వాత ఉండదు. అలాంటి చాలా మంది కథల స్ఫూర్తితో ఈ సినిమా తీశా. అమ్మాయిలను పేరెంట్స్ భయంతో కాదు ధైర్యంతో పెంచాలి అని చెప్పే కథ ఇది. అమ్మాయిలను అమ్మోరులా పెంచాలి’ అని డైరెక్టర్ మున్నా చెప్పారు.
అమ్మాయిల్ని ధైర్యంగా పెంచాలని చెప్పే సినిమా
- Advertisement -
- Advertisement -