Saturday, December 27, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅందర్నీ భయపెట్టే సినిమా

అందర్నీ భయపెట్టే సినిమా

- Advertisement -

ఉత్కంఠభరితమైన కథ, కథనంతో ప్రేక్షకులకి సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌ అనుభూతినిచ్చే విధంగా రూపొందిన చిత్రం ‘అమరావతికి ఆహ్వానం’. శివ కంఠంనేని, ధన్య బాలకృష్ణ, ఎస్తర్‌, సుప్రిత, హరీష్‌ ప్రధాన పాత్రధారులు. జీవీకే దర్శకుడు. నిర్మాత ముప్పా వెంకయ్య చౌదరి నిర్మాణ సారథ్యంలో, జి.రాంబాబు యాదవ్‌ సమర్పిస్తుండగా, లైట్‌ హౌస్‌ సినీ మ్యాజిక్‌ బేనర్‌పై కేఎస్‌ శంకర్‌రావు, ఆర్‌ వెంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శర వేగంగా జరుగుతున్నాయి. తాజాగా క్రిస్మస్‌ శుభాకాంక్షలతో మేకర్స్‌ సరికొత్త పోస్టర్‌, గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు. హీరో శివ కంఠంనేని మాట్లాడుతూ,’ఇప్పటికే అనౌన్స్‌ చేసిన మా టైటిల్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మధ్య ప్రదేశ్‌లోని పలు లొకేషన్స్‌లో షూటింగ్‌ పూర్తి చేశాం. దర్శకుడు జీవికే తన విజన్‌తో ఈ సినిమాకు మంచి అవుట్‌ఫుట్‌ తీసుకువచ్చారు.

అన్ని పాత్రలకి ప్రాధాన్యత ఉండేలా మంచి కథ ఇది. ప్రస్తుతం వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ జరుగుతోంది. తప్పకుండా థియేటర్స్‌లో ప్రేక్షకులకు సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌ అనుభూతినిస్తుంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పూర్తి చేసి అతిత్వరలోనే థియేటర్స్‌లో గ్రాండ్‌ రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం’ అని తెలిపారు. ‘ఈ మధ్య కాలంలో రిలీజైన అన్ని హర్రర్‌ సినిమాలు మంచి విజయం సాధించాయి. అదే తరహాలో మరో డిఫరెంట్‌ హర్రర్‌ థ్రిల్లర్‌ కథాశంతో వస్తోన్న చిత్రమిది. ఆర్టిస్టుల నటన, సీనియర్‌ సినిమాటోగ్రాఫర్‌ జె ప్రభాకర్‌ రెడ్డి విజువల్స్‌, హనుమాన్‌ ఫేమ్‌ సాయిబాబు తలారి ఎడిటింగ్‌ ఈ సినిమాకు ప్లస్‌ అవుతాయి. పద్మనాబ్‌ భరద్వాజ్‌ సంగీతం, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ థియేటర్స్‌లో ఆడియన్స్‌ని హర్రర్‌ మూడ్‌ క్యారీ చేసే విధంగా చేస్తుంది’ అని దర్శకుడు జీవీకే అన్నారు. అశోక్‌ కుమార్‌, హరీష్‌, భద్రమ్‌, జెమినీ సురేష్‌, నాగేంద్ర ప్రసాద్‌ ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: వై.అనిల్‌ కుమార్‌, కె.శ్రీనివాస్‌రావు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -