రామ్ పోతినేని నటిస్తున్న కొత్త సినిమా ‘ఆంధ్ర కింగ్ తాలూకా. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకుంది. చివరి పాట చిత్రీకరణతో సినిమా నిర్మాణ పనులు పూర్తయ్యాయి. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో హైదరాబాద్‌లోని సెట్‌లో రామ్, భాగ్యశ్రీ బోర్సేపై దీనిని చిత్రీకరించారు. ఈ సందర్భంగా హీరో రామ్ ఒక స్పెషల్ నోట్ షేర్ చేశారు. ‘చిత్రీకరణ పూర్తయింది. నేను గర్వపడే సినిమా… మనమందరం గర్వపడే సినిమా..! నా కెరీర్‌లో ఈ అందమైన సినిమా ఇచ్చిన మహేష్‌కి ధన్యవాదాలు. నవంబర్ 28న ఈ సినిమా మీ ముందుకు వస్తోంది’ ఉపేంద్ర ఈ సినిమాలో సూపర్‌స్టార్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్.
మనందరం గర్వపడే సినిమా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



