తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల హదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరో నవీన్ పొలిశెట్టి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు.
తాజాగా ఈ చిత్రం నుండి దీపావళి ప్రత్యేక ప్రోమో విడుదలైంది. నవ్వుల టపాసులను తలపిస్తున్న ఈ ప్రోమో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ అందరి దష్టిని ఆకర్షిస్తోంది.
2026 సంక్రాంతికి ప్రేక్షకులకు నవ్వులతో నిండిన అసలైన పండుగకు హామీ ఇచ్చేలా ఈ ప్రోమో ఉండటం విశేషం.
రెండు నిమిషాల ఇరవై ఎనిమిది సెకన్ల నిడివితో రూపొందిన ఈ దీపావళి ప్రోమో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. అతి కొద్దిమంది మాత్రమే నిమిషంలో ఇంతటి వినోదాన్ని పంచగలరు. అభిమానులు దీనిని ‘ఒక నవ్వుల అల్లరి’, ‘వినోదాల విందు’, ‘అసలైన పండుగ సినిమా’ అని పిలుస్తున్నారు.
హాస్యం తాజాదనంతో ఉండి ప్రేక్షకులను మెప్పించే కథలను ఎంచుకోవడంలో నవీన్ మరోసారి తన నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు. ప్రేక్షకుల ఉత్సాహాన్ని మరింత పెంచుతూ.. ఈ భారీ అంచనాలున్న చిత్రం నుండి మొదటి గీతం త్వరలో విడుదల కానుంది అని చిత్ర యూనిట్ తెలిపింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో మారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
సంక్రాంతి కానుకగా 2026 జనవరి 14న విడుదల కానున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన దీపావళి ప్రోమో ఆ అంచనాలను రెట్టింపు చేసి, అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లలో ఒకటిగా ఈ చిత్రాన్ని నిలిపింది.
నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయా గ్రహణం: జె.యువరాజ్, సంగీతం: మిక్కీ జె.మేయర్, దర్శకత్వం: మారి, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య, సమర్పణ: శ్రీకర స్టూడియోస్.
సంక్రాంతికి వినోదాల విందు
- Advertisement -
- Advertisement -