ఈషా రెబ్బా, సత్య, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘త్రీ రోజెస్’. ఆహా ఓటీటీలో సూపర్ హిట్ అయిన ఈ సిరీస్ సీజన్ 2 ఈ నెల 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. ఈ సిరీస్‌ను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మించగా, డైరెక్టర్ మారుతి షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించారు. మంగళవారం హీరోయిన్ ఈషా రెబ్బా మీడియాతో మాట్లాడుతూ, ‘సీజన్ 2లో నేను కంటిన్యూ కావడం హ్యాపీగా ఉంది. సీజన్ 1లో ఫీమేల్ క్యారెక్టర్స్‌కు వేర్వేరు సీన్స్ ఉంటాయి. ఈ సీజన్ 2లో ఆ క్యారెక్టర్స్ అన్నింటికి కలిపి కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. నేను, రాశీ, కుషిత మూడు కీ రోల్స్ చేశాం. రాశీ ఫైర్ బ్రాండ్‌లా ఉంటుంది. కుషిత చిన్న పిల్లలా అల్లరి చేసేది. వీళ్లిద్దరితో కలిసి నటించడం ఎంజారు చేశాను. ఈ సిరీస్‌లో గ్లామర్ డోస్ పెంచలేదు. యూత్, ఫ్యామిలీ అంతా కలిసి సిరీస్ చూడొచ్చు. సీజన్ 2లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ 30 నిమిషాల నిడివితో సాగుతుంది. సీజన్ 3కి లీడ్ ఇస్తూ సీజన్ 2 కంప్లీట్ అవుతుంది. నేను హర్ష చేసిన సీన్స్ అంత వైరల్ అవుతాయని మేము సీజన్ 1 చేసేప్పుడు అనుకోలేదు. జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో నటించాం. సీజన్ 1లో మా పెయిర్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో సీజన్ 2లో ఇంకా బాగా కాన్ఫిడెంట్‌గా చేశాం. ఈ వెబ్ సిరీస్ మా కెరీర్‌లో ఒక స్పెషల్ ప్రాజెక్ట్‌గా మిగిలిపోతుంది’ అని తెలిపారు.
”త్రీ రోజెస్” సీజన్ 1 కంటే సీజన్ 2 స్కేల్ పరంగా చాలా పెద్దది. ఇందులో కొన్ని అతిథి పాత్రలు కూడా వస్తుంటాయి. సీజన్ 1లోని రివేంజ్‌ను ఈ సీజన్ 2లో తీర్చుకునేందుకు నేను ప్రయత్నిస్తుంటాను. ఈషా, నా క్యారెక్టర్స్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తాయి. సిరీస్ అంతా ఎంటర్‌టైనింగ్‌గా సరదాగా ఉంటుంది. లైఫ్, రిలేషన్ షిప్స్, ఫ్రెండ్ షిప్ గురించి మంచి విషయాలు కూడా ఉంటాయి. అయితే అవి సందేశాలు ఇచ్చినట్లు చూపించలేదు. నన్ను కామెడీతో పాటు మిగతా ఎమోషన్స్ చేయగలను అని నమ్మి ఈ సిరీస్‌లో అవకాశం కల్పించారు. ఈ సంక్రాంతికి వస్తున్న అన్ని సినిమాల్లో నటించా’ అని నటుడు హర్ష చెముడు అన్నారు.
సరదాగా సాగే సిరీస్
- Advertisement -
- Advertisement -



