నవతెలంగాణ – పెద్దవూర
మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాల లో శనివారం ఆశాడమాసంలో భాగంగాగోరంటాకు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థినిలు మహిళా ఉపాధ్యాయులు ఒకరి కొకరు గోరంటాకు పెట్టుకొని శుభాకాంక్షలు తెలుపు కున్నారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ .. ఆషాడమాసంలో సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల్లో భాగంగా పాఠశాలలోని విద్యార్థునిలు,మహిళా ఉపాధ్యాయులు, చేతులు, కాళ్లకు గోరింటాకు పెట్టు కోవడం ఇది సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. ఆషాడంలో గోరింటాకు అరచేతిలో, పాదాలకు గోరింటాకు తప్పక పెట్టుకోవాలని మహిళా ఉపాధ్యాయులు విద్యార్థినులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమాదేవి, కృష్ణయ్య, చంద్రమణి, శంకర్, భాస్కర్, అనిల్, వాల్యా, జతిన్, బాబు, శ్రీనివాస్ రెడ్డి, రాములు, అరవింద్ రెడ్డి, శ్రీనివాస్, లోకేష్, గౌతమ్, మధు, సైదులు, శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు.
జెడ్పిహెచ్ఎస్ లో ఘనంగా గోరంటాకు మహోత్సవం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES