- Advertisement -
హాజరైన రామానుజ జీయర్, ఎమ్మెల్యే
నవతెలంగాణ – మిర్యాలగూడ
మిర్యాలగూడ పట్టణంలోని గీతా మందిర్ లో ధనుర్మాస ఉత్సవంలో భాగంగా శనివారం సుదర్శన యజ్ఞంలోని పూర్ణాహుతి కార్యక్రమానికి శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ సవామి హాజరయ్యారు. వీరికి శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్సాదాలు ప్రసాదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బండారు కుశలయ్య, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



