మునిగలవీడు సబ్ స్టేషన్ ఏఈ భార్గవి
నవతెలంగాణ – నెల్లికుదురు
విద్యుత్తు ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మునిగలవీడు విద్యుత్ సబ్ స్టేషన్ ఏఈ భార్గవి తెలిపారు. మండలంలోని రాజుల కొత్తపల్లి గ్రామంలో విద్యుత్తు సమస్యలు తాగుతాకుండా ఉండేందుకు ప్రజా బాట కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలలో విద్యుత్తుపై అనేకమంది సమస్యలు తలెత్తి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటిని పరిష్కరించేందుకు విద్యుత్తు ప్రజా బాట అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కొన్ని సమస్యలు వివరించగా వాటిని మాపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి తొందరగా పరిష్కరిస్తామని అన్నారు.
విద్యుత్తుకు సంబంధించిన సమస్యలు అటే మా విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకువస్తే వెంటనే మా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు ఎలక్ట్రికల్ యాక్సిడెంట్లు జరుగుతున్నందున వాటిని నివారించేందుకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వినియోగదాలకు క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. వినియోగదారులు తోడ్పాటు అందించి, సంస్థ అభివృద్ధికి పాటుపడాలని కోరడం జరిగింది. గ్రామంలో ఉన్న బకాయి లు వెంటనే చెల్లించాలని మరియు వ్యవసాయదారులు కూడా వారి బకాయిలను చెల్లించి సంస్థకి కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్తు సిబ్బంది శ్రీకాంత్ పరమేష్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.



