నవతెలంగాణ-హైదరాబాద్: సితాఫల్ మండి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫుడ్ ఫెస్ట్ రంగోలి వేడుకలు నిర్వహించారు. ఫుడ్ ఫెస్ట్‌లో భాగంగా విద్యార్థులు వివిధ రకాల సంప్రదాయ, ఆధునిక వంటకాలను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల వంటకాలతో పాటు పోషకాహారంపై అవగాహన కలిగించే వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అదేవిధంగా రంగోలి పోటీల్లో విద్యార్థులు తమ కళాత్మక నైపుణ్యాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. సాంప్రదాయ, పర్యావరణ అనుకూల, సామాజిక సందేశాలను ప్రతిబింబించే రంగోలీలు వేశారు. ఆకర్షణీయంగా వేసిన ముగ్గులు అందరి ప్రశంసలు అందుకున్నాయి.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బంగ్లా భారతి మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులలో సృజనాత్మకత, సమన్వయం,సాంస్కృతిక విలువలను పెంపొందిస్తాయని తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థులు స్వశక్తి తో ఎదగడానికి ఇలాంటి కార్యక్రమాలు తొడపడతాయి అని ఆకాంక్షించారు. విద్యార్థుల సృజనాత్మకతను, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఫుడ్ ఫెస్ట్, రంగోలి వేడుకలను ఘనంగా నిర్వహించామన్నారు.
ఈ కార్యక్రమం విద్యార్థులకు మధురమైన అనుభూతిగా నిలిచింది.కళాశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ ,అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది, విదార్థులు పాల్గొని సంక్రాంతి పండుగ ముందుగానే కళాశాలకు వచ్చేసింది అని ఆనందం వ్యక్తం చేశారు.




