- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
చారకొండ మండలంలోని శేరి అప్పారెడ్డిపల్లి వాసి ప్రశాంత్ కుమార్ కి ఆయన చేసిన ఉపాధ్యాయ సేవలకు గాను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా పురస్కారం అందుకున్నారు. గ్రామస్తుల ఆధ్వర్యంలో పాఠశాలలో ఉపాధ్యాయుడు ప్రశాంత్ కుమార్ కి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయునిగా నేను చేసిన సేవలకు గాను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుని పురస్కారం అందించినందుకు ప్రభుత్వానికి, సన్మానించిన గ్రామ యువకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమ్ము మహేష్, కొమ్ము సురేష్, కొమ్ము అనిల్ కుమార్, ఏలేటి సంతోష్, గోలి ప్రతాప్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -