నవతెలంగాణ- పెద్దకొడప్ గల్
పెద్ద కొడపగల్ మండల కేంద్రంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో జరిగిన పోషణ మాసం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ… ఆరోగ్యకరమైన జీవనానికి అవసరమైన పౌష్టిక ఆహారం గురించి ప్రతి ఇంటిలో అవగాహన కల్పించడమే పోషణ మాసం ముఖ్య ఉద్దేశమని అన్నారు.కుటుంబం ఆరోగ్యంగా ముందుకు వెళ్లాలంటే కుటుంబంలో మహిళల పాత్ర ముఖ్యమని అన్నారు. మహిళలు గర్భిణీలు చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో పోషకాహార ప్రాముఖ్యత ఎంతో గాను ఉంటుందని అన్నారు. ప్రతి కుటుంబం ఆరోగ్యవంతంగా ఉండేందుకు సమాజంలో పోషణ పై అంగన్వాడీ సిబ్బంది అవగాహన కల్పించాలని అన్నారు.
గర్భిణీ స్త్రీల పోషణ స్థితిని మెరుగుపరిచినట్లయితే మన భావితరాల పిల్లల పోషణ లోపం లేకుండా ఆరోగ్యంగా జన్మిస్తారాని,అప్పుడే భావితారాలు పోషణ లోపం లేకుండా ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందన్నారు. అనంతరం పిడి ప్రమీల మాట్లాడుతూ….పోషణ మాసంలో పోషకాహారం గురించి గర్భిణీలు, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారము గురించి వివరించారు. బిడ్డ పుట్టగానే గంటలోపు ముర్రుపాలు త్రాగించాలని,తల్లి పాల యొక్క ప్రాముఖ్యత వివరించారు. స్థానికంగా చుట్టుపక్కల దొరికే పోషకలతో కూడిన ఆహార పదార్థాలు వినియోగించాలని సూచించారు.సీడీపీఓ కళావతి మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు పోషకాహారంపై శ్రద్ధ చూపాలని,అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు, బాలింతలకు పిల్లలకు అందించే పౌష్టికాహారని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గర్భిణీలు ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు ఆరోగ్య జన్మిస్తారని అన్నారు.కార్యక్రమంలో ఎంపీడీవో బిఆర్ అభినవ్ చందర్,ఎమ్మార్వో అనిల్,సిడిపిఓలు కళావతి ,సౌభాగ్య,మండల సూపర్వైజర్లు నసీమాడేగం అంగన్వాడీ టీచర్లు,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుమహేందర్ రెడ్డి,మోహన్, శామప్ప బసవరాజ్ దేశాయ్ మల్లప్ప పటేల్ నాగిరెడ్డి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ నాగరాజు ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.



