భారత రాజ్యాంగ పరిరక్షనే అంబేద్కర్ కు అర్పించే ఘన నివాళి
ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్యాల గోవర్ధన్
నవతెలంగా – కంఠేశ్వర్
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఐఎన్టియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్యాల గోవర్ధన్ ఆధ్వర్యంలో పులాంగ్ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భారత దేశ భౌతిక పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగ రూపకల్పన చేసిన అంబేద్కర్, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను అమలు చేయకుండా, హక్కులను హరించివేసే చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. దేశ ప్రకృతి సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ ఆయనకు అర్పించే ఘన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్లానీ శివ, సుభాష్, రాజు, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



