Friday, January 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పార్వతమ్మ గూడెం సర్పంచ్ కు ఘన సన్మానం 

పార్వతమ్మ గూడెం సర్పంచ్ కు ఘన సన్మానం 

- Advertisement -

నవతెలంగాణ – నెల్లికుదురు 
మండలంలోని పార్వతమ్మ గూడెం గ్రామ సర్పంచ్ ఎదెల పూలమ్మను గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించినట్లు నెల్లికుదురు సర్పంచ్ పులి వెంకన్న తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్వతమ్మ గూడెం గ్రామ అభివృద్ధి కోసం వృద్ధాప్యంలో ఉండి కూడా అభివృద్ధి చేయడానికి ముందుకు అడుగు వేసిన పూలమ్మకు ప్రజలందరూ రణపడి ఉంటామని అన్నారు. ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నందుకు కృతజ్ఞతలు అని తెలిపారు. 

నెల్లికుదురు సర్పంచ్ పులి వెంకన్నకు ఘన సన్మానం 
మండల కేంద్ర సర్పంచిగా పులి వెంకన్నను భారీ మెజార్టీతో మండల కేంద్ర ప్రజలు గెలిపించి వెంకన్న ముందుకు సాగుతున్నందుకు మర్యాదపూర్వకంగా అతనికి శాలువాతో ఘనంగా సత్కరించినట్లు పార్వతమ్మ గూడెం సర్పంచ్ ఏదేళ్ల పూలమ్మ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదెళ్ల యాదవ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల కేంద్రంలో నెల్లికుదురు గ్రామాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి పరిచేందుకు ముందు కాడికి వేసి భారీ మెజార్టీతో గెలుపొందిన వెంకన్నను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని అన్నారు.

పులి వెంకన్న ఆ గ్రామాన్ని అభివృద్ధి పరిచేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నాడని అతని అభినందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ బ్లాక్ అధ్యక్షులు ఎదళ్ల యాదవ రెడ్డి,నెల్లికుదురు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, నేల్లికుదురు గ్రామ పార్టీ అధ్యక్షులు రత్నపూరo యాకయ్య,మండల యూత్ అధ్యక్షులు మది రాజేష్, పెరుమాండ్ల జగన్ బాబు గౌడ్, ఉప్పలయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -