- Advertisement -
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
ఉత్తమ సేవలు అందించిన తంగళ్ళపల్లి మండల అధికారికి ఘన సన్మానం జరిగింది. తంగళ్ళపల్లి మండల అభివృద్ధి అధికారి లక్ష్మీనారాయణ పంద్రాగస్టు సందర్భంగా ఉత్తమ అధికారిగా ఎంపికయ్యారు. ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ అధికారి గా ప్రశంస పత్రాన్ని అందుకున్న లక్ష్మీనారాయణ ను తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం అధ్యక్షులు రాపల్లి ఆనందం, పద్మ నగర్ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు మొర శ్రీకాంత్ లు మంగళవారం ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం నాయకులు మాట్లాడుతూ ఉత్తమ అధికారిగా ఎంపికైన లక్ష్మీనారాయణ పద్మశాలి ముద్దుబిడ్డ కావడం ఎంతో గర్వంగా ఉందన్నారు.
- Advertisement -