Monday, December 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన సర్పంచుకు ఘనంగా సన్మానం..

నూతన సర్పంచుకు ఘనంగా సన్మానం..

- Advertisement -

నవతెలంగాణ -చిన్నకోడూరు
రెండవ విడత సర్పంచ్ ఎన్నికలలో గెలుపొందిన ఇబ్రహీంనగర్ గ్రామ సర్పంచ్ ములకల వజ్రవ్వ కుంటయ్య సర్పంచును, 6వ వార్డు సభ్యుడు కావటి శ్రీనివాసును యాదవ సంఘంలో సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ వజ్రవ్వ మాట్లాడుతూ మన సంఘంతో పాటు గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పరుచుకోవడానికి మనందరి సహకారం ఉండాలని అన్నారు. మన గ్రామం అంత ఒక కుటుంబ సభ్యులుగా ఉంటే గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవచ్చు అన్నారు. అద్భుతమైన విజయాన్ని అందించిన గ్రామ  ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -