- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: టాలీవుడ్ నటి ప్రగతి, 50 ఏళ్ల వయసులో, ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025లో పాల్గొని నాలుగు పతకాలు గెలుచుకుంది. డెడ్ లిఫ్ట్ విభాగంలో స్వర్ణం, స్క్వాట్, బెంచ్ ప్రెస్ విభాగాల్లో రజతం, ఓవరాల్‌గా రజత పతకంతో భారతదేశానికి కీర్తిని తెచ్చింది. ఛాంపియన్‌షిప్ నుంచి తిరిగి వచ్చిన ప్రగతిని కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు ఘనంగా స్వాగతించారు. ఈ విజయంపై ఆమె మాట్లాడుతూ, ‘నన్ను ప్రేమించే వారు నా పట్ల గర్వపడటం నా జీవితంలో నిజమైన విజయం’ అని పేర్కొంది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- Advertisement -



