Sunday, August 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఏపీఎంకు ఘన సన్మానం..

ఏపీఎంకు ఘన సన్మానం..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండలంలోని ఇందిరా క్రాంతి పథకంలో కొన్నేళ్లుగా విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ మనోహరాబాద్ కు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో సత్యనారాయణ దంపతులకు కార్యాలయ సిబ్బంది, బందు మిత్రులు కలిసి ఏపీఎంను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇందిరా క్రాంతి పథకంలో మండలంలో పలు గ్రామ సంఘాలను బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేశారని, శ్రీనిధి లోన్లు,  రికవరీ వసుళ్లు, కొత్త గ్రామ సంఘాలు , మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడానికి అహర్నిశలు కృషి చేస్తూ స్థానికంగానే కుటుంబ సభ్యులతో ఉంటూ మహిళల ఆర్థిక అభివృద్ధికి ఎంతో కృషి చేసినారని మిత్రులు కొనియాడారు . ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది , మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -