Sunday, August 3, 2025
E-PAPER
Homeఆదిలాబాద్గ్రంథాలయ సంస్థ చైర్మన్‌కు ఘన సన్మానం..

గ్రంథాలయ సంస్థ చైర్మన్‌కు ఘన సన్మానం..

- Advertisement -

నవతెలంగాణ – బజార్ హాత్నూర్
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన మల్లెపూల నరసయ్య ను నియోజకవర్గ పార్టీ నేతలు ఆయనకు శాలువా కప్పి పూలమాల వేసి ఘనంగా సత్కరించారు. ఆదివారం మండల కేంద్రంలోని తిరుమల ఫంక్షనాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమనికి ముఖ్య అధితిగా పాల్గొన్న బోథ్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆడే గజేందర్, మాజీ ఎంపీ సోయం బాపురవ్ లు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పార్టీ రుణపడి ఉంటుందని, ప్రత్యేక స్థానం కల్పిస్తుందని కొనియాడారు.

  ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జల్కే పాండురంగ్, ఇచ్చోడ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సత్యవతి కోటేశ్, బోథ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పోరెడ్డినారాయణ, తలమడుగు మాజీ జడ్పీటీసీలు గోక గణేష్ రెడ్డి, బాబాన్న, తలమడుగు మండల మాజీ ఎంపీపీ కల్యాణం రాజేశ్వేర్, సుంకుడి మాజీ ఎంపీటీసీ వెంకన్న యాదవ్, బోథ్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బద్దం పోతా రెడ్డి, మండల అధ్యక్షులు కానిదే దినేష్, సినియార్ నాయకులూ ఏలేటి రాజా శేఖర్ రెడ్డి, మౌలానా, యువనాయకులు ఎండి సద్దాం, అశోక్ తదితరులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -