Friday, December 26, 2025
E-PAPER
Homeజిల్లాలుకమ్మర్ పల్లి పాలకవర్గానికి ఘన సన్మానం

కమ్మర్ పల్లి పాలకవర్గానికి ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ- కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని స్థానిక పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో సర్పంచ్ హారిక, ఉపసర్పంచ్ అశోక్‌లతో పాటు వార్డు సభ్యులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా అధ్యక్షులు రామగౌడ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో పాలకవర్గం పాత్ర కీలకమన్నారు. బహుజన వర్గాల సంక్షేమం కోసం, గ్రామంలోని మౌలిక సదుపాయాల కల్పన కోసం పాలకవర్గం చిత్తశుద్ధితో పని చేయాలని కోరారు. పాలకవర్గం సభ్యులకు  జేఏసీ సభ్యులను పరిచయం చేస్తూ, గ్రామాభివృద్ధికి ఎల్లప్పుడూ పూర్తి సహకారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం సర్పంచ్ హారికఅశోక్ మాట్లాడుతూ తమను సత్కరించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ, మండల కేంద్రాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని వారు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల జేఏసీ నాయకులు గుర్రం నరేష్, పాలేపు రాజేశ్వర్, తిరుపతి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -