- Advertisement -
నవతెలంగాణ – మిడ్జిల్
రంగారెడ్డి జిల్లా నాచారం గ్రామంలో యాదవ్స్ విజన్ మీడియా ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికలలో గెలుపొందిన సర్పంచులకు సన్మాన కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండలంలోని మసి గుండ్లపల్లి సర్పంచ్ శ్రీశైలం యాదవ్ ను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, వృద్ధి రాజ్ శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించినట్లు చెప్పారు. గ్రామ అభివృద్ధిలో యాదవులు ముందు ఉండాలని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేయాలని చెప్పారు. రాజ్యాధికారంలో యాదవులు ముందుండాలని యాదవుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలను అందే విధంగా కృషి చేయాలని కోరారు.
- Advertisement -



