Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్అగ్నిమాపక సిబ్బందికి ఘన సన్మానం..

అగ్నిమాపక సిబ్బందికి ఘన సన్మానం..

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
గత మూడు రోజుల నుండి అధిక వర్షపాతంతో దెబ్బతిన్న కామారెడ్డి పట్టణంలోని జి ఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్, అశోక్ నగర్, రుక్మిణి కుంట, బతుకమ్మ కుంట లోతట్టు ప్రాంతాలలో  అధిక వర్షపాతంతో నష్టపోయిన ప్రజలను కాపాడిన కామారెడ్డి అగ్నిమాపక అధికారులను, సిబ్బందిని, వారు చేసిన సేవలను గుర్తించి, సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ ఎంఏ సలీం ప్రతినిధులతో కలిసి శాలువా కప్పి మేమొంటో లతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక జిల్లా  అధికారి సాధన, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అబ్దుల్ సలాం లను ప్రత్యేకంగా సన్మానించినారు. ఈ సందర్భంగా స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అబ్దుల్ సలాం మాట్లాడుతూ సమాచార హక్కు చట్ట ప్రతినిధులు ఇటీవలే అధిక వర్షపాతంతో నష్టపోయిన పేద ప్రజలను భోజన,ఇతర వసతులతో చేసిన సేవ లకు గాను సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ కామారెడ్డి వాసులను అభినందించారు.

అగ్నిమాపక సిబ్బందిని సన్మానించడం చాలా గర్వకారణంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ రాష్ట్ర సలహాదారులు కేతు రమణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వి భాస్కర్, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, న్యాయ సలహాదారులు న్యాయవాది ఇక శ్రీనివాసరావు, జోనల్ అధ్యక్షులు సిర్నాపల్లి ప్రదీప్ కుమార్, కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు న్యాయవాది షబానా బేగం, కార్యదర్శి చెట్ల జమున, సంయుక్త కార్యదర్శి అనిత, పట్టణ మహిళ అధ్యక్షురాలు అల్సా బేగం, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad