Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంబీహార్‌ సర్పంచ్‌ల బృందం గ్రామపంచాయతీల సందర్శన

బీహార్‌ సర్పంచ్‌ల బృందం గ్రామపంచాయతీల సందర్శన

- Advertisement -

నవతెలంగాణ-శంషాబాద్‌
బీహార్‌కు చెందిన సర్పంచులు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండల పరిధిలోని నర్కూడ, ముచ్చింతల్‌, కవ్వగూడ గ్రామపంచాయతీలను గురువారం సందర్శించారు. రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ (ఎన్‌ఐఆర్‌డీ)లో శిక్షణ పొందుతున్న సర్పంచులు.. అందులో భాగంగా గ్రామపంచాయతీలను సందర్శించారు. గ్రామ పంచాయతీల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీలు నిర్వహిస్తున్న పల్లె ప్రకృతి వనం, నర్సరీల నిర్వహణతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేశారు. ఈ పర్యటనలో ఎన్‌ఐఆర్‌డీ ప్రోగ్రాం డైరెక్టర్‌ అరుణ జయమణి, గ్రామపంచాయతీ కార్యదర్శులు సీహెచ్‌ శ్రీకాంత్‌గౌడ్‌, జోష్న, పంచాయతీ కార్యదర్శులు ఎం.శ్రీకాంత్‌, ఎం.సమత, ముచ్చింతల్‌ మాజీ సర్పంచ్‌ బీర్ల పెంటయ్య, ఈసీ ప్రవీణ, కారోబార్‌ మధు, వీవోఏ షబానా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img