Saturday, January 10, 2026
E-PAPER
Homeజాతీయంహిమాచల్‌లో ఘోరరోడ్డు ప్రమాదం

హిమాచల్‌లో ఘోరరోడ్డు ప్రమాదం

- Advertisement -

500 అడుగుల లోయలో పడిన బస్సు.. 9 మంది మృతి

సిర్మౌర్‌: హిమాచల్‌ప్రదేశ్‌ సిర్మౌర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రయివేట్‌ బస్సు లోయలో పడి 9 మంది చనిపోయారు. 40 మందికిపైగా గాయపడ్డారు. శిమ్లా నుంచి కుప్వికి వెళ్తున్న బస్సు హరిపుర్‌ధర్‌ దగ్గర అదుపుతప్పి 500 అడుగుల లోయలో పడింది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను బస్సు లోపల నుంచి బయటకు తీశారు. అనంతరం అక్కడికి చేరుకున్న సహాయక సిబ్బంది గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -