Tuesday, June 3, 2025
E-PAPER
Homeసినిమాభారీ హిస్టారిక్‌ యాక్షన్‌ సినిమా

భారీ హిస్టారిక్‌ యాక్షన్‌ సినిమా

- Advertisement -

‘కార్తికేయ 2’ పాన్‌ ఇండియా స్థాయి విజయంతో హీరో నిఖిల్‌ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇప్పుడు మరో పాన్‌ ఇండియా వెంచర్‌ ‘స్వయంభు’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. భరత్‌ కష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ గ్రాండ్‌-స్కేల్‌ హిస్టారిక్‌ యాక్షన్‌ ఎపిక్‌ మూవీ ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. పిక్సెల్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై భువన్‌, శ్రీకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్‌ మధు సమర్పిస్తున్నారు. ‘స్వయంభు’ టీం నిఖిల్‌ పుట్టినరోజున పవర్‌ఫుల్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు. నిఖిల్‌, సంయుక్త యుద్ధ నేపథ్యంలో కనిపించిన ఈ పోస్టర్‌ అదిరిపోయింది. నిఖిల్‌ యుద్ధం మధ్యలో కత్తి పట్టుకుని యోధుడిలా పవర్‌ఫుల్‌గా కనిపించారు. ఆయన పక్కన, సంయుక్త విల్లు బాణంతో నిలబడి టార్గెట్‌ని చేరుకున్నట్లు కనిపించడం ఆకట్టుకుంది. బ్యాక్‌డ్రాప్‌లో సెంగోల్‌ చాలా ఆసక్తికరంగా ఉంది. సెంగోల్‌ శక్తి, ధర్మానికి చిహ్నం. ప్రాచీన రాజ్యాల నుండి భారతదేశ స్వాతంత్య్రం వరకు, సెంగోల్‌ ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన ప్రాచీన చరిత్ర ప్రకారం శ్రీ రాముడు సెంగోల్‌ను నీతిమంతమైన పాలనకు చిహ్నంగా అందుకున్నారు, ఇది న్యాయమైన నాయకత్వానికి ఉదాహరణగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ఈ శక్తివంతమైన నేపథ్యాల చుట్టూ అద్భుతమైన కథతో వస్తోంది. రాబోయే టీజర్‌ ఈ ఎగ్జైటింగ్‌ వరల్డ్‌ని మరింత రివీల్‌ చేేయనుంది. నభా నటేష్‌ ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -