Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeసోపతిమరణం లేని భాష

మరణం లేని భాష

- Advertisement -

తెలుగు వెలగదనీ వెలవెలబోతుందనీ
వేదికలమీద విలవిలలాడిపోకండి!
తెలుగుభాష అజరామరభాష, చావులేని అమతభాష
టక్కులేసుకున్నవాళ్లు మరచినా
పొరుగుభాషల ప్రేమలోపడి విడిచినా
కూలీలపాటల్లో శ్రమజీవుల జానపదాలల్లో నిలిచేవుంటది!
దుమ్ము చేసిన చేలోకి దిగి నాట్లు వేసేచోట
బట్టలుదికే రేవుతావులో, మేకలుగాసే పోరడి నాల్కమీద
చేపలు పట్టే జాలయ్య కల్లు తాగి పదమందుకునే వేళలో
తెలుగుభాష గజ్జెకట్టి తాండవమాడతానే వుంటది
తెలుగు మరుగు కాదు, జిహ్వతెరమరుగు కానే కాదు
మట్టిమనుషులున్నంత వరకూ తెలుగుతేజానికి వెలితి లేనట్టే!
పొలాన గేదెలపేడను తీసే పాలేరు పిల్లాడు
బఫెల్లోలాంగ్వేజీ పలకబోడు…
పూలమ్ముకొని ఆకలిమంటను చల్లార్చుకునేవాడు
మూరభాషను విస్మరించడు… ఆకాశాన్ని తాకే భవంతులు
తెలుగునేలమీద నిలబడొచ్చు ఆ భవంతుల్లో
కూరలు తరిగే పనిమనిషికి కుకింగ్‌ అనడం వల్లగాదు
వత్తికులాలున్నంత వరకూ, చెమటబతుకులున్నంత వరకూ
తెలుగుకి శూన్యస్థానం రాదు!
డాలర్లవేటకి వెళ్లిన బయల్దేరిన సుకుమారులారా!
అమ్మనీ అయ్యనీ వద్ధాశ్రమాల్లో
శాశ్వతంగా దిగబెట్టి కలగనకండి…
అమ్మానాన్నలు శ్వాస తీసుకున్నట్టే
తెలుగుభాషా ఊపిరి తీసుకుంటుంది!
తెలుగుభాషపై ద్రోహం
విదేశీయులది కాదు, విద్య నేర్చిన దేశీయులదే!
లాలిభాష మరచిన వాళ్లదే మరణం!
ఉగ్గుపాలభాషను గుర్తుంచుకోని వాళ్లదే హేళనాచరణం!
తెలుగు భాషకు తిరుగులేదు కష్టజీవులు వున్నంతవరకూ…!
– ధాత్రి భీమనేటి

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad