Thursday, November 6, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుపోరువీరుని చరిత్రకు అక్షరరూపం

పోరువీరుని చరిత్రకు అక్షరరూపం

- Advertisement -

ఏజెన్సీలో విప్లవ పునాదులు నిర్మించిన భీష్మారావు : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం
భీష్మారావు 40వ వర్ధంతి సందర్భంగా భద్రాచలంలో పుస్తకావిష్కరణ

నవతెలంగాణ- భద్రాచలం
బూర్జువా, భూస్వామ్య, పెట్టుబడిదారి దోపిడీ నుంచి బలహీన వర్గాల ప్రజలను రక్షించేందుకు భద్రాచలం ఏజెన్సీలో విప్లవ పునాదులను నిర్మించిన బత్తుల భీష్మారావు పోరాట చరిత్రకు ఆయన సతీమణి, ఐద్వా రాష్ట్ర సీనియర్‌ నేత హైమావతి అక్షర రూపాన్ని ఇవ్వడం అభినందనీయమని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. సాహసోపేతంగా జీవించిన వారే వీరోచిత మరణం పొందుతారనటానికి బండారు చందర్రావు, భీష్మారావు, శ్యామల వెంకట్‌ రెడ్డి వంటి నాయకులే ప్రత్యక్ష నిదర్శనం అని అన్నారు. భీష్మారావు 40వ వర్ధంతి సభ, పుస్తకావిష్కరణ బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరిగింది.

ఈ సభకు తమ్మినేని వీరభద్రం, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ హాజరయ్యారు. పుస్తకావిష్కరణకు సభకు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. తమ్మినేని మాట్లాడుతూ.. విప్లవం కోసం పనిచేసిన భీష్మారావు, చందర్రావుని 1985 నవంబర్‌ 5న అత్యంత కిరాతకంగా హత్య చేసి విప్లవానికి పుట్టిన వికృత శిశువులు అని పీపుల్స్‌ వారు మరోసారి రుజువు చేశారని తీవ్రంగా విమర్శించారు. నాటి నుంచి నేటి వరకు కమ్యూనిస్టు నాయకులపై నిర్బంధాలు, దాడులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా.. ఎంతమంది నాయకులను హతమార్చినా ఈ దేశానికి ప్రత్యామ్నాయం కమ్యూని స్టులేనని చెప్పారు.

హత్యా రాజకీయాలతో ప్రజా పోరాటాలను ఆపలేరు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
80వ దశకంలోనే అంటరానితనంపై అమరులు కామ్రేడ్‌ భీష్మారావు, చంద్రారావు వంటి కమ్యూనిస్టు నాయకులు ఉద్యమాలను నిర్మించారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. ఓ పక్క బూర్జువా.. భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూనే గ్రామాల్లో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమం నిర్మించారని, అటువంటి విప్లవ వీరులను అంతమొందించి విప్లవాన్ని అణచివేయాలనుకోవడం పగటి కలలేనని అన్నారు. ఒక వీరుడు మరణిస్తే వందల మంది విప్లవకారులు పుట్టుకొస్తారని చెప్పారు. రాష్ట్రంలో మతోన్మాద శక్తులు విస్తరించకుండా నివారించేందుకే జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి సీపీఐ(ఎం) మద్దతు ఇచ్చిందని తెలిపారు. ఈ సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, బండారు రవికుమార్‌, పుస్తక రచయిత హైమావతి తదితరులు మాట్లాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -