- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద ఉల్లిపాయల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ స్వల్పంగా గాయపడ్డారు. అయితే అటుగా వెళ్తున్న వాహనదారులు ఇదేమీ పట్టించుకోకుండా ఉల్లిపాయల కోసం ఎగబడ్డారు. అందినకాడికి ఎత్తుకెళ్లారు. ఇక ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వారిని నిలువరించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
- Advertisement -



