పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
నవతెలంగాణ – పెద్దవంగర
నిజాలను నిర్భయంగా రాసే పత్రిక నవతెలంగాణ దిన పత్రిక అని పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి కొనియాడారు. పత్రిక పదో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆమె నవతెలంగాణ దిన పత్రిక ప్రతినిధితో మాట్లాడారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పత్రిక నిలవాలి, నిజాలను రాస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొనాలని ఆమె ఆకాక్షించారు. ఇప్పటికే పత్రిక ప్రజల ఆశల మేరకు ప్రతి రోజు నిజాలను అందిస్తూ ప్రభుత్వానికి ప్రజలకి మద్య వారధిగా నిలుస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రజల హృదయాలను, అభిమానాన్ని పొందుతూ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పత్రిక ఎడిటర్ తో పాటు పత్రిక సిబ్బంది, రిపోర్టర్లకు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు.
నిజాలను నిర్భయంగా రాసే పత్రిక.. నవతెలంగాణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES