టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా విమానంలో మంటలు
ప్రమాద సమయంలో ఫ్లైట్‌లో 169 మంది ప్రయాణికులు
బ్రెజిల్ : బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో రన్‌వేపై బయల్దేరేందుకు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో మంటలు వ్యాపించాయి. సావ్‌పౌలోలోని గ్వారుల్హోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఈ ప్రమాద వివరాలిలా ఉన్నాయి. లాటమ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ 320 విమానం 169 మంది ప్రయాణికులు, సిబ్బందితో టేకాఫ్ అయ్యేందుకు రన్‌వేపై సిద్ధంగా ఉంది. ఆ సమయంలో విమానం క్యాబిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది.. వెంటనే అందులోని ప్రయాణికులను కిందకు దించారు. క్షణాల్లోనే విమానం నుంచి పెద్దఎత్తున మంటలు, పొగ వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
బ్రెజిల్‌లో తప్పిన పెనుప్రమాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



